: మానవ సంబంధాలు మాయం... ఆస్తి కోసం కన్న తండ్రినే చంపిన కుమార్తె, విశాఖలో కలకలం!


మానవ సంబంధాలు దారుణంగా పడిపోతున్నాయనడానికి మరో నిదర్శనం ఈ ఘటన. ఆస్తి కోసం తన భర్తతో కలిసి కన్న తండ్రినే చంపించిందో మహిళ. మరిన్ని వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లాకు చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి విశాఖపట్నం పరిధిలోని శ్రీహరిపురానికి వచ్చి పలు రకాల కాంట్రాక్టులు చేస్తూ, డబ్బు బాగా సంపాదించాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. అతని భార్య మరణానంతరం మరో మహిళను ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాడు. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆస్తికి మహిళ వారసురాలిగా మారుతుందని భావించిన కుమార్తె తండ్రిని చంపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆపై భర్త సాయంతో అతన్ని చంపేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు.

  • Loading...

More Telugu News