: తిరుమలలో సందడి చేసిన సినీ నటి రాధ
నాటి అందాల తార రాధ తిరుమలలో సందడి చేసింది. తన భర్త, కూతురు కార్తీకతో కలిసి ఆమె ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మంటపంలో స్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. అనంతరం రాధ మాట్లాడుతూ, ప్రత్యేకమైన రోజుల్లో తమ కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడికి రావాలనిపిస్తుందని, అయితే, వివిధ కారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పింది. ఈరోజు తన భర్త పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చామని రాధ చెప్పింది. కాగా, గతంలో పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. రాధ కుమార్తె కార్తీక కూడా హీరోయిన్ గా చిత్ర రంగప్రవేశం చేసింది.