: 'మహా' ముఖ్యమంత్రి భార్యకు గాల్లోంచి నక్లెస్ తీసిచ్చిన గురువానంద్ స్వామి


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృత తాజాగా ఓ స్వామీజీ వద్దకు వెళితే, ఆయన గాల్లోంచి ఓ బంగారు గొలుసును సృష్టించి ఆమెకు బహుమతిగా అందించారు. ఆ దృశ్యాలు వీడియోకు చిక్కి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. పూణెలోని ఓ విద్యా సంస్థలో జరిగిన అవార్డుల బహూకరణ కార్యక్రమంలో గురువానంద్ స్వామి పాల్గొనగా, ఈ ఘటన జరిగింది. ఆయనిచ్చిన బంగారు నక్లెస్ ను అమృత స్వీకరించడం, ఆపై ఆయన పాదాలకు అభివందనం చేయడం ఈ దృశ్యాల్లో కనిపిస్తుండగా, ఇప్పుడు దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి ఈ విషయమై వివరణ ఇవ్వాలని, ఆయన క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్రలో మంత్రశక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కమిటీ అధ్యక్షుడు అవినాష్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆ స్వామీజీ మరోసారి ఇదే విధంగా తమ ముందు చేసి చూపి మరో బంగారు గొలుసును తీస్తే రూ. 21 లక్షల బహుమతి ఇస్తామని తెలిపారు. కాగా, దీనిపై స్పందించిన అమృత, "నాకు అద్భుత మహిమలపై నమ్మకం లేదు. ఓ పెద్దాయనకు గౌరవం ఇవ్వాలనే గొలుసును స్వీకరించాను" అని తెలిపారు.

  • Loading...

More Telugu News