: టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్


తెలంగాణ టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను హర్షిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాక కేసీఆర్ వైపు ప్రజాతీర్పు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. దాంతో మొదటిసారి ప్రజలు పూర్తిగా ఒకేవైపు నిలిచారని అర్థమవుతోందని వివేక్ చెప్పారు.

  • Loading...

More Telugu News