: నేటి తొలి 'జంప్ జిలానీ' కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్... కేసీఆర్ ఇంటికి పయనం!
నేడో రేపో మరికొంత మంది విపక్ష ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారని వచ్చిన వార్తలు నిజమవుతున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత కుదేలు చేస్తూ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఉదయాన్నే ఆయన కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. నేడు లేదా రేపు ఆయన గులాబీ కండువాను కప్పుకుంటారని సమాచారం. కనీసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాస గూటిలో వాలనున్నట్టు తెలుస్తోంది. ఎటొచ్చీ వాళ్లు ఎవరన్నదే తెలియాల్సివుంది.