: స్టీవ్ వా అత్యంత స్వార్థపరుడు: షేన్ వార్న్


ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా అత్యంత స్వార్థపరుడని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘ఐయామ్ ఏ సెలబ్రిటీ’ కార్యక్రమానికి హాజరైన షేన్ వార్న్ మాట్లాడుతూ, అతన్ని తాను ఇష్టపడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నాడు. స్టీవ్ వా అత్యంత సెల్ఫిష్ క్రికెటర్ అని విమర్శించాడు. 1999లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ గురించి ఇక్కడ ప్రస్తావించాడు. ఆ సిరీస్ లో చివరి మ్యాచ్ కు తనను స్టీవ్ దూరం చేశాడని.. ఆ సమయంలో తాను చాలా నిరాశ చెందానని.. అయితే, పదేళ్ల తర్వాత గర్వంగా భుజాలెగరేశానని షేన్ వార్న్ చెప్పాడు.

  • Loading...

More Telugu News