: వైట్ హౌస్ ఏమంత సౌకర్యం కాదంటున్న ఒబామా జంట!


సకల సౌకర్యాలకు నిలయమైన అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' అంతగా సంతృప్తికరంగా లేదన్నది బరాక్ ఒబామా కుటుంబ ఫిర్యాదు. అవును మరి... వైఫై పనిచేయడం లేదంటే అంతేగా, మిగతా ఎన్ని సదుపాయాలున్నా చేతిలోని స్మార్ట్ ఫోన్ కు వైఫై సిగ్నల్స్ అందకుంటే మిగతావన్నీ వృథాయే. ఒబామాతో పాటు ఆయన భార్య మిచెల్, కుమార్తెలది కూడా ఇదే ఫిర్యాదు. పాతకాలం భవంతి కావడంతో ఎన్నో డెడ్ స్పాట్ లు వైఫై సిగ్నల్స్ ను కదలనీయడం లేదని, దీంతో అవస్థలు పడాల్సి వస్తోందని ఒబామా వ్యాఖ్యానించారు. తన కుమార్తెలు వైట్ హౌస్ సౌకర్యంగా లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాదిలో పదవీకాలం ముగించుకోనున్న ఒబామా ఓ టీవీ చానల్ కు తన భార్య మిషెల్లీతో కలసి ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త అధ్యక్షుడి కోసం వైఫై సిస్టమ్ ను ఆధునికీకరిస్తామని చెప్పారు. కొత్త అధ్యక్షుడికి మీరిచ్చే సలహాలు ఏంటి? వాటర్ ఫెసిలిటీ ఎలా వుంది? లింకన్ బెడ్ రూమ్ టాయిలెట్ బాగా పనిచేస్తోందా? అంటూ సదరు చానల్ ప్రతినిధి అడిగితే, సమాధానాలు చెప్పారు. వైట్ హౌస్ ను వీడి వెళ్లే ముందు మరోసారి సూపర్ బౌల్ పార్టీని ఇస్తానని ఒబామా తెలిపారు.

  • Loading...

More Telugu News