: భారత్ మంచి స్నేహితుడిని కోల్పోయింది... నేపాల్ మాజీ ప్రధాని మృతికి మోదీ సంతాపం
నేపాల్ మాజీ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నేటి ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండులో సుశీల్ కొయిరాలా కన్నుమూసిన విషయం తెలిసిందే. సుశీల్ మరణ వార్తను తెలుసుకున్న వెంటనే మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుశీల్ మరణంతో నేపాల్ ఓ గొప్ప నేతను కోల్పోయిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాక సుశీల్ మరణంతో భారత్ ఓ మంచి స్నేహితుడిని కూడా కోల్పోయిందని ఆయన తన సంతాప సందేశంలో తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో మోదీ తన సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు.