: ప్రసార భారతిలో కాజోల్... పార్ట్ టైం సభ్యురాలిగా నియామకం
బాలీవుడ్ నటి కాజోల్ కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతిలో ఆమె స్వల్పకాలిక (పార్ట్ టైం) సభ్యురాలిగా నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రసార భారతి ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసార భారతిలో ప్రస్తుతం రెండు పార్ట్ టైం మెంబర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కమిటీ... ఒక పోస్టుకు కాజోల్ ను ఎంపిక చేసింది. మరో పోస్టుకు దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు చెందిన శశిశేఖర్ వేంపాటిని నియమించేందుకు కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి.