: ఇక ‘టీం రాహుల్’... 600 మందిని స్వయంగా ఇంటర్వ్యూ చేసిన యువరాజు


గడచిన సార్వత్రిక ఎన్నికలో ఘోర పరాజయం... కాంగ్రెస్ పార్టీని సమూల ప్రక్షాళన దిశగా పయనించేలా చేస్తోంది. త్వరలో పార్టీ పగ్గాలు చేపట్టనున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పార్టీ నేతలతో, ప్రధానంగా యువరక్తంతో పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ తరహా సమూల ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుందన్న విషయాన్ని పక్కనబెడితే, రాహుల్ గాంధీ మాత్రం తన జట్టును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన యువ నేతల్లోని దాదాపు 600 మందిని స్వయంగా రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశారట. సదరు ఇంటర్వ్యూల్లో తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నవారిని షార్ట్ లిస్ట్ చేసుకున్న రాహుల్, తాను పార్టీ పగ్గాలు చేపట్టిన మరుక్షణమే ఈ కొత్త కార్యవర్గాన్ని రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ‘మెయిల్ టుడే’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News