: పెంపుడు శునకానికి జాతీయజెండా చుట్టిన వ్యక్తిపై కేసు నమోదు


కుక్కకు జాతీయ జెండా చుట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఇటీవల నిర్వహించిన రన్ లో పిప్లోడ్ ప్రాంతానికి చెందిన భతర్ గోహిల్, తన పెంపుడు శునకంతో పాల్గొన్నాడు. ఆ సందర్భంలోనే తన శునకానికి జాతీయ జెండాను చుట్టి మరీ తీసుకువచ్చాడు. ఈ విషయమై అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News