: ఇది వినియోగదారుల విజయం: ట్రాయ్ నిర్ణయంపై రాహుల్ గాంధీ


ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ పై నెట్ న్యూట్రాలిటీ విజయం సాధించినట్టు ట్రాయ్ ప్రకటించడంపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇది వినియోగదారుల అతిపెద్ద విజయం అని ఆయన ట్వీట్ చేశారు. నెట్ న్యూట్రాలిటీ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు. ఇకపై ఇంటర్నెట్ అందరికీ సమానంగా సేవలందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రాయ్ నిర్ణయం హర్షణీయమని రాహుల్ తెలిపారు. ఇంటర్నెట్ యూజర్స్ నెట్ న్యూట్రాలిటీపై విస్తృత ప్రచారంతో పోరాటం సాగించారని ఆయన కొనియాడారు.

  • Loading...

More Telugu News