: వస్తువును రిటర్న్ చేస్తే అమెజాన్ ఇకపై డబ్బులు వాపస్ చేయదు!
ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న డిజిటల్ విధానం కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఈ కామర్స్ వ్యాపారాలు మరింత ఎత్తుకు చేరుతున్నాయి. దీంతో కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. గతంలో ఏదైనా వస్తువును అమెజాన్.కామ్ లో కొనుగోలు చేసిన అనంతరం అది వినియోదారుడ్ని సంతృప్తిపరచకపోతే ...దానిని రిటర్న్ చేస్తే సదరు సంస్థ డబ్బు వాపస్ చేసేది. దీంతో అమెజాన్ తక్కువ వ్యవధిలో వినియోగదారుల ఆదరణ చూరగొంది. తాజాగా అమెజాన్ రిటర్న్ పాలసీలో భారీ మార్పులు చేసింది. కొనుగోలు చేసిన వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం వేరే పేజ్ లో ఉంటుందని, దానిని చూసుకున్న తరువాతే కొనుగోలు చేయాలని సూచిస్తోంది. డెలివరీ అయిన వస్తువు డేమేజ్ అయిన పక్షంలో కానీ, లేక కొనుగోలు చేసిన వస్తువు స్థానంలో వేరే వస్తువు డెలివరీ అయిన పక్షంలో కానీ ఈ రిటర్న్ పాలసీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. మిగతా విషయాలలో వస్తువును రిటర్న్ చేసే అవకాశం లేదని అమెజాన్ వెల్లడించింది. ఈ నిబంధన ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.