: లండన్ వీధుల్లో ‘గూగుల్’ డ్రైవర్ లెస్ కారు!


గూగుల్ సంస్థ తన డ్రైవర్ లెస్ కారును లండన్ వీధుల్లో త్వరలో పరీక్షించనున్నట్లు స్కై న్యూస్ వెల్లడించింది. అమెరికా రోడ్లతో పోలిస్తే లండన్ రహదారులు చాలా రద్దీగా ఉంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షించనున్న డ్రైవర్ లెస్ కారుపై తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు లండన్ ట్రాన్స్ పోర్టు డిప్యూటీ మేయర్ ఇసాబెల్ డెడ్ రింగ్ తెలిపారు. ఈ విషయమై గత మూడేళ్ల కాలంలో ఆరుసార్లకు పైగా లండన్ స్థానిక రవాణా శాఖాధికారులు గూగుల్ సంస్థ తో సంప్రదింపులు జరిపారన్నారు. ‘గూగుల్’ కారును ఎంత వేగంతో పరీక్షిస్తారో తెలియాల్సి ఉంది. కాగా, ‘గూగుల్’ డ్రైవర్ లెస్ కారును అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పరీక్షించింది. తాజాగా, వాషింగ్టన్ లో కూడా పరీక్షలు నిర్వహించింది.

  • Loading...

More Telugu News