: మహేల, సంగక్కర లేని లోటు భర్తీ చేయలేం: శ్రీలంక కెప్టెన్ చండిమాల్
మహేల జయవర్ధనే, కుమార సంగక్కర లేని లోటు భర్తీ చేయలేమని శ్రీలంక టీట్వంటీ జట్టు కెప్టెన్ దినేష్ చండిమాల్ తెలిపాడు. పూణేలో జరగనున్న టీట్వంటీ మ్యాచ్ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీనియర్లు లసిత్ మలింగ్, మాథ్యూస్, దిల్షాన్ గాయాలపాలవ్వడం కూడా జట్టుకు ఇబ్బందిగా పరిణమించిందని తెలిపాడు. అయితే ఈ టూర్ టీట్వంటీ వరల్డ్ కప్ సందర్భంగా శ్రీలంక జట్టులో చోటు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్న కుర్రాళ్లకు మంచి అవకాశమని చండిమాల్ పేర్కొన్నాడు. పటిష్ఠమైన భారత జట్టుకు గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. గాయం నుంచి కోలుకుంటున్న దిల్షాన్ రెండో టీట్వంటీ నాటికి జట్టులో చేరతాడని ఆశిస్తున్నానని చండిమాల్ చెప్పాడు.