: జగన్ ను ఇంతవరకు నేను ప్రత్యక్షంగా చూడనే లేదు!: ముద్రగడ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను తాను ఇంతవరకు ప్రత్యక్షంగా చూడనే లేదని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, బొత్స సత్యనారాయణను కూడా తానెప్పుడూ కలవలేదని చెప్పారు. మొన్న మీటింగ్ జరిగిన రోజే బొత్సను ప్రత్యక్షంగా కలిశానని ఆయన చెప్పారు. తనపై డిప్యూటీ సీఎం చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. తాను డబ్బు కోసం పని చేసే మనిషిని కాదని ఆయన చెప్పారు. జీవితంలో చరమాంకానికి చేరుకుంటున్నానని, జాతికి ఏదో ఒకటి చేయాలని భావించి ఉద్యమం ప్రారంభించానని అన్నారు. తన వెనుక ఎవరూ లేరని చెప్పిన ఆయన, తనపై ఆరోపణలు చేస్తే, ఘాటుగా స్పందిస్తానని ఆయన హెచ్చరించారు. తనను ఏమన్నా అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తానని ఆయన చెప్పారు. తానెవరినీ ఏమీ అనడం లేదని చెప్పిన ఆయన, తనను కూడా ఏమీ అనవద్దని సూచించారు. తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన జగన్ కు ధన్యవాదాలని ఆయన చెప్పారు.