: హైదరాబాదులోని హిమయత్ నగర్ లో కాల్పుల కలకలం


హైదరాబాదులోని హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 లో కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ లోని బ్లూ పార్క్ హోటల్ లో వ్యాపార లావాదేవీలపై మాట్లాడుకోవాలని భావించిన ముగ్గురు వైద్యులు కారులో హోటల్ కు బయల్దేరారు. ఈ ప్రయాణంలో వారు వ్యాపార లావాదేవీలపై మాట్లాడుతుండగా, ఉదయ్ అనే వైద్యుడిపై, మరోవైద్యుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తూటా ఉదయ్ చెవి పక్కనుంచి దూసుకుపోవడంతో, భయపడిన ఉదయ్ డ్రైవింగ్ సీట్ నుంచి దూకేశారు. ఈ సందర్భంగా ఆయనకు బాగా గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆటోలో వెళ్లి అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కాల్పుల కలకలం రేగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే నిందితులు, బాధితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News