: 'ప్రేమికుల రోజు' చేసుకోవడానికి లోన్ కావాలట!


వ్యాపారం కోసమో, ఇల్లు కొనుక్కోవడం కోసమో, లేక వాహనం కొనుక్కోవడం కోసమో బ్యాంకుల్ని లోను అడగడం మామూలే. అయితే, ఇందుకు భిన్నంగా గుజరాత్ కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి 'ప్రేమికుల రోజు'కు లోన్ కావాలని తనపై అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అతని పేరు దిగ్విజయ్ సింగ్(25). ప్రొబేషనరీ అధికారిగా పని చేస్తున్నాడు. రూ.42,970 అడ్వాన్స్ గా ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకోగా పరిశీలించిన బ్యాంకు మేనేజర్ దానిని తిరస్కరించారు. ప్రేమికుల రోజును పండుగగా గుర్తించి లోన్ ఇవ్వడం సాధ్యం కాదని ఉద్యోగికి చెప్పారు. అయితే తాను పబ్లిసిటీ కోసం ఈ దరఖాస్తు చేసుకోలేదని దిగ్విజయ్ చెబుతున్నాడు. గతంలో వసంతోత్సవం పండుగకు కూడా ఆయన లోన్ పెట్టుకుంటే బ్యాంకు మంజూరు చేసిందట.

  • Loading...

More Telugu News