: రేపటి మ్యాచ్ కు అంతా సిద్ధం...గెలుపు ర్యాంకును ప్రభావితం చేస్తుంది


శ్రీలంకతో టీట్వంటీ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టీట్వంటీ మ్యాచ్ ల సిరీస్ లో గెలిచిన జట్టు ఆత్మవిశ్వాసంతో టీట్వంటీ వరల్డ్ కప్ లో అడుగుపెడుతుంది. ఆస్ట్రేలియా జట్టును అసాధారణ రీతిలో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు పొట్టి ఫార్మాట్ లో నెంబర్ వన్ జట్టుగా ఎదిగింది. ఈ ర్యాంకును పదిలం చేసుకోవాలంటే శ్రీలంకను ఓడించాలి. లేని పక్షంలో ర్యాంకింగ్స్ లో భారత జట్టు కిందికి జారిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. సంచలనాలకు మారుపేరైన శ్రీలంక జట్టు యువ ఆటగాళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. పొట్టి ఫార్మాట్ లో శ్రీలంక జట్టుకు పటిష్ఠమైనదిగా పేరుంది. దీనికితోడు ర్యాంకింగ్స్ లో భారత్ కు సమఉజ్జీగా ఉంటోంది. గత కొంత కాలంగా యువ జట్టు అద్వితీయంగా రాణిస్తోంది. ఈ నేపధ్యంలో టీట్వంటీల్లో తిరుగులేని జట్టుగా పేరున్న భారత జట్టును ఓడించి ప్రపంచ కప్ కొల్లగొట్టాలని శ్రీలంక భావిస్తోంది. ఇదే సమయంలో వరల్డ్ కప్ ను మరోసారి భారత్ కు తీసుకురావాలని ధోనీ ఆశిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా రాణించలేకపోయిన భారత జట్టుకు పూర్వవైభవం తీసుకువచ్చి, మరోసారి ఛాంపియన్ గా నిలిచి చరిత్రను తిరగరాయాలని ధోనీ ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో రేపు పూణే వేదికగా తొలి టీట్వంటీ ప్రారంభం కానుంది. సిరీస్ ను సాధించాలని రెండు జట్లు శ్రమిస్తున్నాయి.

  • Loading...

More Telugu News