: త్వరలోనే పెళ్లి చేసుకుంటా!: ప్రియాంకా చోప్రా
తన వివాహం త్వరలోనే ఉంటుందని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తెలిపింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎప్పుడూ నవ్వించే వాడు, బాగా చూసుకునేవాడు భర్తగా రావాలని అమ్మాయిలంతా కోరుకుంటారని చెప్పింది. తానూ అలాంటి వాడినే కోరుకుంటున్నానని ప్రియాంక తెలిపింది. తన వివాహం త్వరలోనే జరుగుతుందని, అందుకు సరైన సమయం రావాలని ప్రియాంక స్పష్టం చేసింది. 'క్వాంటికో' సీరియల్ లో నటించిన తరువాత ప్రియాంక హాలీవుడ్ కు వెళ్లిపోతుందంటూ కథనాలు వెలువడిన నేపథ్యంలో త్వరలో తాను వివాహం చేసుకోబోతున్నట్టు ఆమె తెలపడం విశేషం.