: మెక్ కల్లమ్ కు ఘనమైన వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ జట్టు


న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాట్స్ మన్ బ్రెండన్ మెక్ కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. అద్భుతమైన ఫాంలో ఉండగా క్రికెట్ నుంచి నిష్క్రమించిన క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ కావడం విశేషం. ఆస్ట్రేలియాపై 55 పరుగుల విజయంతో న్యూజిలాండ్ జట్టు మెక్ కల్లమ్ కు ఘనమైన వీడ్కోలు పలికింది. 27 బంతుల్లో 47 పరుగులు సాధించిన మెక్ కల్లమ్ న్యూజిలాండ్ తరపున అత్యధిక వన్డే సిక్సర్లు (200) బాదిన క్రికెటర్ గా రికార్డుపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. రిటైర్ అయినప్పటికీ మెక్ కల్లమ్ ఐపీఎల్ లో తన ఆటతీరుతో కనువిందు చేయనున్నాడు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో షాహిద్ అఫ్రిదీ (352), సనత్ జయసూర్య (270) క్రిస్ గేల్ (238), తరువాత మెక్ కల్లమ్ కొట్టిన సిక్సర్లే ఎక్కువ!

  • Loading...

More Telugu News