: బ్రిటన్ విమానాల్లో మహిళా సిబ్బందికి వెసులుబాటు
ఇకపై బ్రిటన్ విమానాల్లో మహిళా సిబ్బంది స్కర్ట్స్ ధరించాల్సిన అవసరం లేదు. ఆ డ్రెస్ కోడ్ నుంచి వారికి విముక్తి కల్పించిన విషయాన్ని బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థ అధికారులు తెలిపారు. మహిళా సిబ్బంది డిమాండ్ మేరకు సంస్థ అందుకు అంగీకరించింది. పొట్టి దుస్తులు ధరించడంపై విమానాల్లో పనిచేసే మహిళా సిబ్బంది కొన్నేళ్లుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్కర్ట్స్ ధరించడం తమ సంప్రదాయాలకు అనుగుణమైంది కాదని కొందరు, ఇతర కారణాల నేపథ్యంలో మరికొంత మంది మహిళా సిబ్బంది ఈ డ్రెస్ కోడ్ వద్దని... నిండుగా ఉండే దుస్తులు ధరించేందుకు అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థ తీసుకున్న నిర్ణయంపై మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, తమ విమానాల్లో పనిచేసే సిబ్బంది 'అంబాసిడర్ బ్రిటిష్ ఎయిర్ వేస్' యూనిఫాం ధరిస్తారని అన్నారు. గతంలో పైజామాలు ధరించడానికి అనుమతించే వాళ్లం కాదని.. ఇక నుంచి పైజామాలు కూడా ధరించవచ్చని వివరించారు.