: తిరుపతి కోదండరామస్వామి ఆలయ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయం డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న భూపతిరెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో 30 ఆలయాలు ఉన్నాయి. దీంతో ఆయన అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. తిరుపతిలో నాలుగంతస్తుల భవనం, తిరుచానూరులో లాడ్జి, 30 ఇంటి స్థలాల డాక్యుమెంట్లు, 2 లాకర్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేగాకుండా 18 స్థలాలు అమ్మినట్టు నిర్ధారించారు.