: నారాయణఖేడ్ ఉపఎన్నికను వాయిదా వేయండి: సీఈసీకి టి.కాంగ్రెస్ వినతి
ఈవీఎంలపై అనుమానాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీని కలిశారు. నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో ప్రింటర్ ఈవీఎంలను ప్రవేశపెట్టాలని లేదా బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలని కోరారు. ఈ రెండు సాధ్యం కాకపోతే ఉపఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేయాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ వినతిపత్రం అందించారు. వరంగల్ ఉపఎన్నిక సమయంలోనే తమకు ఈవీఎంలపై అనుమానం వచ్చిందని, తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో అది నిజమైందని శ్రవణ్ మీడియాతో అన్నారు. అసలు ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ కు కచ్చితంగా వంద స్థానాలు వస్తాయని కేటీఆర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు.