: ఐఎన్ఎస్ విరాట్ ను మన రాష్ట్రానికి కేటాయించమని చెప్పాం: చంద్రబాబు
త్వరలో విధుల నుంచి రిటైర్ కానున్న ఐఎన్ఎస్ విరాట్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలని కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐఎన్ఎస్ ను నిర్వహిస్తామని అన్నారు. ఇందుకు భారీ మొత్తం వ్యయమవుతుందని తెలిపిన ఆయన, ఇందులో నేరుగా హెలీకాప్టర్లు దిగే సౌకర్యం ఉందని, ఒకేసారి 5 వేల మందికి సౌకర్యం కల్పించడం దీని ప్రత్యేకత అని చెప్పిన ఆయన, టూరిజంను ప్రోత్సహించేందుకు ఇది సువర్ణావకాశమని ఆయన తెలిపారు. అలాగే లోతైన తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతమని చెప్పిన ఆయన, దీనిని వినియోగించుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన చెప్పారు. విశాఖపట్టణాన్ని లాజిస్టిక్స్ హబ్ గా మారుస్తామని ఆయన తెలిపారు.