: 50 దేశాలకు సంబంధించిన షిప్ లను మన రాష్ట్రపతి కమిషన్ చేశారు: చంద్రబాబు
50 దేశాల ప్రతినిధులు విశాఖపట్టణంలో ఐదు రోజులపాటు ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 50 దేశాలకు సంబంధించిన షిప్ లను మన రాష్ట్రపతి కమిషన్ చేశారని అన్నారు. 50 దేశాల ప్రతినిధులు మన దేశ రాష్ట్రపతి, ప్రధానులకు గౌరవవందనం చేయడం అసాధారణ విషయమని ఆయన చెప్పారు. ఇలాంటి అద్భుత ఘట్టానికి విశాఖ వేదికైందని ఆయన తెలిపారు. దీంతో విశాఖపట్టణం అంతర్జాతీయ స్ధాయిలో సరికొత్త గుర్తింపును తెచ్చుకుందని ఆయన అన్నారు. సుందరమైన నగరమైన విశాఖ ఈ ఉత్సవాల్లో మరింత అందంగా కనిపించిందని ఆయన తెలిపారు. హోటల్స్ నుంచి సముద్రాన్ని చూసినా, సముద్రంలోంచి విశాఖను చూసినా ఆనందకరమేనని ఆయన వివరించారు. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, నౌకాదళ చీఫ్, కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖలతో విశాఖ కళకళలాడిందని ఆయన తెలిపారు.