: పవన్ కల్యాణ్ శిఖండిలా వ్యవహరిస్తున్నారు: సీపీఐ నారాయణ
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయ వ్యవహారాల్లో శిఖండి పాత్ర పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యమాలు వచ్చినప్పుడే సీఎం చంద్రబాబును రక్షించేందుకు ఆయన తెరపైకి వస్తున్నారని చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కుల రాజకీయాలను, ఉద్యమాలను తీసుకొచ్చింది చంద్రబాబేనని నారాయణ విమర్శించారు. దమ్ముంటే రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీల్లో చేర్చగలరా? అంటూ ముక్కుసూటిగా ప్రశ్నించారు.