: సమ్మె విరమణకు ఢిల్లీ మున్సిపల్ కార్మికుల అంగీకారం
డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల కార్మికులు ఇవాళ సమ్మె విరమించేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో కార్మికులు, మున్సిపల్ కార్పొరేషన్ల వర్గాల తరపున వాదనలు జరిగాయి. వారి వాదనలు విన్న కోర్టు జీతాలకు సంబంధించి రికార్డులు పరిశీలించింది. జీతాలు అందని వారికి రెండు రోజుల్లో అందజేయాలని కార్పొరేషన్లకు తెలిపింది. వెంటనే ఒప్పుకున్న మున్సిపల్ కార్పొరేషన్లు రెండో రోజుల్లో జీతాలు ఇస్తామని హామీ ఇచ్చాయి. దాంతో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కార్మికులు సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరేందుకు కోర్టులో అంగీకారం తెలిపారు.