: జగన్ కు, చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన ముద్రగడ


ఈ ఉదయం ఆమరణ నిరాహార దీక్షను విరమించిన అనంతరం, ఉద్యమానికి పూర్తి మద్దతు ఇచ్చిన వారందరికీ ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా అధినేత జగన్ తన దీక్షకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజు తదితరులు తనకు వెన్నుదన్నుగా నిలిచారని, లోక్ సత్తా నేత జయప్రకాశ్ సైతం వెన్నంటి నిలిచారని తెలిపారు. సినీ నటుడు చిరంజీవి తనను కలిసేందుకు వచ్చారని తెలిసి ఆనందం వేసిందని అన్నారు. కాపు నేతలు దాసరి నారాయణరావు, వట్టి వసంతకుమార్, వి.హనుమంతరావు, హర్షకుమార్ తదితరులంతా తనకు సంఘీభావం తెలిపారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన అచ్చెన్నాయుడు తదితరులు, కాపులకు న్యాయం చేసేందుకు హామీ ఇచ్చారని, వారి మాటలు నమ్మాలి కాబట్టి నమ్ముతున్నానని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఆశాభావం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News