: మహిళా సర్పంచ్ కు మోహన్ బాబు అభినందనలు


చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కొటాల పద్మజను సినీ నటుడు మోహన్ బాబు ప్రశంసించారు. రామిరెడ్డిపల్లిలో ఇవాళ జల్లికట్టు ప్రదర్శన నిర్వహించారు. మోహన్ బాబు, మంచు మనోజ్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరై జల్లికట్టు ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్ కు కోడలుగా వచ్చి, సర్పంచ్ గా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారంటూ పద్మజను మెచ్చుకున్నారు. జల్లికట్టుపై మాట్లాడుతూ, పశువులను హింసించకుండా ఎన్నో ఏళ్లుగా వస్తున్న జల్లికట్టు ఆటను నిర్వహించడాన్ని తప్పుపట్టరాదన్నారు.

  • Loading...

More Telugu News