: నిమ్మరసం తాగించిన కళా... దీక్ష విరమించిన ముద్రగడ


కాపులకు రిజర్వేషన్ల కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం తన దీక్షను విరమించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ముద్రగడ ఇంటికి వచ్చిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దౌత్యం ఫలించింది. కాపులకు రిజర్వేషన్లపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే నిమ్మరసం తెప్పించిన కళా వెంకట్రావు, ముద్రగడ నోటికి స్వయంగా అందించారు. దీంతో ముద్రగడ నాలుగు రోజుల దీక్ష విరమించినట్లైంది.

  • Loading...

More Telugu News