: నా రాజీనామా వార్తల్లో వాస్తవం లేదు: ఉత్తమ్


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తాను రాజీనామా చేస్తానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఉత్తమ్ చెప్పారు. ఈ మేరకు మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఆయన మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంలలో మోసంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈవీఎంలకు సంబంధించిన ప్రింట్ వివరాలు అందించాలని కోరామన్నారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని, నారాయణఖేడ్ ఉప ఎన్నికలో బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని ఉత్తమ్ కోరారు.

  • Loading...

More Telugu News