: ముద్రగడ ముందు మూడు ప్రతిపాదనలు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో గంటకు పైగా ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు ఆయన ముందు ప్రధానంగా మూడు ప్రతిపాదనలను ఉంచారు. మొదటిది జస్టిస్ మంజునాథన్ కమిషన్ కు నిర్ధిష్ట కాలపరిమితి, రెండోది కాపు కమిషన్ లో ముద్రగడ సూచించిన ఒకరికి స్థానం కల్పించడం, మూడవది కాపు కార్పొరేషన్ కమిషన్ కు రుణాలిచ్చేలా హామీ ఇవ్వడం. వాటికి ఆయన ఒప్పుకోగానే దీక్ష విరమిస్తారని తెలుస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, వర్మ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు చర్చలు జరుపుతున్నారు.