: కేటీఆర్ కుటుంబ వారసుడే కానీ... రాజకీయ వారసుడెలా అవుతాడు?: మంద కృష్ణ
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున అంతా తానై వ్యవహరించిన మంత్రి కేటీఆర్... పార్టీకి చారిత్రక విజయం తీసుకురావడంతో ఆయన పాప్యులారిటీ మరింత పెరిగింది. దాంతో సీఎం కేసీఆర్ వారసుడు కేటీఆరేనని అంతా అనుకుంటున్నారు. ఎంపీ కవిత కూడా అలానే వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కేటీఆర్ కుటుంబ వారసుడు కావొచ్చు కానీ... రాజకీయ వారసుడు ఎలా అవుతారని మీడియా సమావేశంలో ప్రశ్నించారు. అసలు కేసీఆర్ కు పుత్రుడిపై ఉన్న ప్రేమ దళితులపై ఎందుకు లేదని సూటిగా అడిగారు. గ్రేటర్ ఎన్నికల్లో కారు సునామీకి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోతే మరి ఎంఐఎం ఎందుకు కొట్టుకుపోలేదని ఆయన ప్రశ్నించారు.