: ఎంపీ అసదుద్దీన్ కు బెయిలు మంజూరు


కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెయిలు మంజూరైంది. హైదరాబాద్ నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్ న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. ఈ నెల 2న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సమయంలో మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో అసదుద్దీన్ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఎదుట ఈరోజు ఆయన లొంగిపోయారు. దాంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నాంపల్లిలోని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, అసద్ అభ్యర్థన మేరకు బెయిల్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News