: ముద్రగడతో చర్చలు ప్రారంభించిన ప్రభుత్వ ప్రతినిధులు


తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రతినిధులుగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చర్చలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతుల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చించేందుకు మరోసారి ముందుకువచ్చింది. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముద్రగడకు వివరించనున్నారు. అంతేగాక ఈ అంశంపై సర్కారు చిత్తశుద్ధిని కూడా తెలియజేయనున్నారు. వారితో చర్చల తరువాత ముద్రగడ దంపతులు దీక్ష విరమించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News