: హస్తినకు నేడు చంద్రబాబు పయనం... కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో జైట్లీతో కీలక భేటీ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. నేటి మధ్యాహ్నం 3.15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరనున్న చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్ కు తుది రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు... జైట్లీ ముందు పెట్టనున్నట్లు సమాచారం. ఇంకా పలువురు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News