: భారత రెవెన్యూ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన పాక్
భారత రెవెన్యూ సేవల వెబ్ సైట్ (ఐఆర్ఎస్ - http://www.irsofficersonline.gov.in)ను పాక్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ వెబ్ సైట్ గత రెండు రోజులుగా పనిచేయడం లేదు. నిన్న ఆదివారం కావడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే, 'పాకిస్థాన్ జిందాబాద్' వంటి నినాదాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. వెబ్ సైట్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది తామేనని ఇంతవరకూ ఏ సంస్థా ప్రకటించుకోలేదు.