: నా నుంచి కాంగ్రెస్ బ్లడ్ పారిపోయింది... టీడీపీ బ్లడ్ వచ్చింది: రాయపాటి
‘నా నుంచి కాంగ్రెస్ బ్లడ్ పారిపోయింది... దాని స్థానంలో టీడీపీ బ్లడ్ వచ్చింది’ అన్నారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. ‘ముప్ఫై సంవత్సరాలకు పైబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీలో కాంగ్రెస్ బ్లడ్ ఇంకా ఉందా?’ అనే ప్రశ్నకు రాయపాటి పైవిధంగా స్పందించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఉన్నట్లయితే ‘కాంగ్రెస్ రక్తమే’ తనలో ఉండేదని.. ఇప్పుడు వాళ్లు లేరు కనుక టీడీపీ రక్తం తనలోకి కొత్తగా వచ్చిందని సమాధానమిచ్చారు. ‘గాంధీ కుటుంబానికి చాలా దగ్గరగా మసలిన మిమ్మల్ని ఆ కుటుంబం ద్రోహం చేసిన మాట వాస్తవమేనా?’ అని ప్రశ్నించగా.. ‘ఆ కుటుంబం నాకు ద్రోహం చేసిన మాట వాస్తవమే. ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లేవాడిని. రాజీవ్ గాంధీ బెంజ్ కారు తోలుతుంటే నేను పక్కన కూర్చునే వాడిని. ఆయనకు నేను సొంత అన్నలా ఉండేవాడిని. అపాయింట్ మెంట్ లేకుండానే వాళ్ల ఇంటికి డైరెక్టుగా వెళ్లే వాడిని. ఇక చంద్రబాబునాయుడుగారు కూడా నాకు మొదటి నుంచీ ముఖ్యుడు. శ్రేయోభిలాషి’ అని ఆయన చెప్పారు.