: దర్శకుడు భీమనేనికి అన్నీ పర్ఫెక్టుగా ఉండాలి: పోసాని కృష్ణమురళి
దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కి ఆయన ధరించే డ్రెస్సు దగ్గర నుంచి, తీసే సినిమా వరకు అన్నీ పర్ఫెక్టుగా ఉండాలని.. లేకపోతే అస్సలు ఊరుకోరని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. 'స్పీడున్నోడు' చిత్రం గురించి ఆయన ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భీమనేని, తాను రూమ్ మేట్స్ మని.. ప్రతిదీ పర్ఫెక్టుగా ఉండాలని ఆయన అప్పటి నుంచి కోరుకునేవారని అన్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అని, బాగా చేయాలని ఆయన తనకు చెప్పారని అన్నారు. 'రామానాయుడు కంపెనీలో పనిచేస్తే ఎంత పర్ఫెక్టుగా డబ్బులిస్తారో, భీమనేని దగ్గర పనిచేసినా అంతే పర్ఫెక్టుగా డబ్బులిస్తారు. ఈ చిత్రం కోసం సుమారు రెండున్నరేళ్లు భీమనేని కష్టపడ్డాడు. ప్రతి సీన్ ని ఆయన జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ చిత్రంలో నా పాత్రకు మంచి పేరువచ్చింది. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు భీమనేని సినిమాను బాగా తీశారు. ఆయా పాత్రలకు తగిన నటీనటులను పర్ఫెక్టుగా ఎంపిక చేయడమే కాకుండా వారితో బాగా నటించేలా చేశారు' అని చెప్పారు.