: ఆందోళన ఉగ్రరూపం దాల్చకముందే కాపు నేతలతో చర్చలు జరపండి: పవన్ కల్యాణ్


కాపులను బీసీల్లో చేర్చే అంశంపై కాపు నేతలతో నేరుగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. దీనిపై జరుగుతున్న ఆందోళన ఉగ్రరూపం దాల్చకముందే ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఇందుకు కొందరు మేధావులతో కూడిన ఒక టీమ్ ను నియమించాలని, త్వరగా పరిష్కారం చూపాలని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News