: 'రోజా' నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది!: ‘రెహ్మాన్’ ఆస్థాన వేణుగాన విద్వాంసుడు నవీన్


ఫ్లూట్ అంటే తనకు చాలా ఇష్టమని... అది వాయిస్తున్నప్పుడు పొందే అనుభూతి, ఆనందం వేరని ఏఆర్ రెహ్మాన్ ఆస్థాన వేణుగాన విద్వాంసుడు నవీన్ కుమార్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "మా నాన్న నేర్చుకుందామని ప్రయత్నించారు కానీ, ఆయనకు రాలేదు.. ఏడవ తరగతిలో వుండగా నేను ట్రై చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత విశాఖపట్టణంలోని సీబీఎం హైస్కూల్ లో ఫ్లూట్ వాయించాను. ఫ్లూట్ నేర్చుకోవాలన్న నా ఆసక్తిని గమనించిన మా అమ్మానాన్న నాకు శిక్షణ ఇప్పించారు" అన్నారు. అయితే, తనకు ఫ్లూట్ నేర్పించిన వ్యక్తి తన గాత్రానికి, ఫ్లూట్ కు సరిపోవడం లేదని అన్నారని, అయినప్పటికీ, తాను పట్టుదలతో నేర్చుకున్నానని చెప్పారు. వయోలిన్ కూడా తాను నేర్చుకున్నానని చెప్పారు. ఇక తన సంగీత ప్రయాణం మొదలైంది తమిళనాడు నుంచి అని అన్నారు. 'రోజా' చిత్రం ద్వారా రెహ్మాన్-నవీన్ కాంబినేషన్ మొదలైందని, అప్పటి నుంచి రెహ్మాన్ తో తన ప్రయాణం కొనసాగుతోందని ఆయన నవ్వుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News