: ఆ అవగాహన ఉంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు: సచిన్ టెండూల్కర్
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనచోదకులకు, పాదచారులకు మధ్య అవగాహన ఎలా ఉండాలంటే... క్రికెట్ లో స్ట్రయికర్ కు, నాన్ స్ట్రయికర్ కు మధ్య వుండేటటువంటి సమన్వయం ఉండాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు రహదారి భద్రతా ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్లపై వెళుతున్నప్పుడు పాటించాల్సిన నిబంధనల గురించి ఆయన ప్రస్తావించారు. స్వచ్ఛందంగా మనం నిబంధనలు పాటిస్తే రహదారులపై ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తాను రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎదురైన చేదు అనుభవాలను సచిన్ గుర్తుచేసుకున్నారు.