: టీచర్ని కదిలించిన చిన్నారి వ్యాసం!


పదేళ్ల బాలిక రాసిన వ్యాసం చదివిన ఉపాధ్యాయురాలు కన్నీరు పెట్టింది. దీనికి కారణం.. ఆ విద్యార్థిని కుటుంబ పరిస్థితి! కోల్ కతాలోని ఒక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు హోం వర్క్ కింద ఒక వ్యాసం రాసుకుని రమ్మనమని విద్యార్థులకు ఎస్సైన్ మెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక ఈ వ్యాసం రాసింది. ఆ వ్యాసం కొనసాగిన తీరు...‘ మా నాన్న చెడ్డవాడు. అమ్మను, నన్నూ రోజూ కొడుతుంటాడు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మా బంధువులు చూసీచూడనట్లుగా ఉంటారు. నేను పెద్దదాన్నయిన తర్వాత నాన్న నుంచి అమ్మను దూరంగా తీసుకుపోతాను. బాగా చూసుకుంటాను’ అని ఆ వ్యాసంలో ఆ చిన్నారి రాసింది. ఈ వ్యాసాన్ని మర్నాడు ఉదయం ఉపాధ్యాయులరాలికి చూపించగా, ఆమె కన్నీరుపెట్టింది. అయితే, ఆ ఉపాధ్యాయురాలు అంతటితో ఊరుకోకుండా, ఈ విషయాన్ని ప్రిన్సిపల్ కు చెప్పింది. వెంటనే సదరు విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించారు. విద్యార్థిని తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన పద్ధతి మార్చుకోకపోతే వారికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయని తెలియజెప్పారు. దీంతో బాలిక తండ్రిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తన తండ్రిపై నమ్మకంతో పాటు విశ్వాసం కూడా బాలికకు పెరిగింది. కాగా, విద్యార్థిని రాసిన వ్యాసాన్ని చదివి వదిలివేయకుండా.. బాధ్యతగా వ్యవహరించిన ఆ ఉపాధ్యాయురాలిని పలువురు ప్రశంసించారు.

  • Loading...

More Telugu News