: టీడీపీ కాపు నేతలతో బాబు అత్యవసర భేటీ!
కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ కాపు నేత ముద్రగడ పద్మనాభం దంపతులు ఆమరణదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ముద్రగడతో దీక్ష విరమింపజేస్తే రాజకీయంగా దెబ్బతింటామని కాపు నేతలు ఆయన వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. చర్చలకు వెళితే ప్రభుత్వం దిగొచ్చినట్లు అవుతుందని, దీక్ష కొనసాగితే ఉద్యమం తీవ్రమవుతుందని బాబు అన్నట్లు కాపు నేతల ద్వారా తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఈ భేటీ జరిగినట్లు సమాచారం.