: రాజమహేంద్రవరంలో టెన్షన్... మాజీ ఎంపీ హర్షకుమార్ హౌస్ అరెస్ట్
కాపులకు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉభయగోదావరి జిల్లాలలో పెద్ద ఎత్తున ఆందోళనకు తెర తీసింది. తాజాగా కొద్దిసేపటి క్రితం రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ దీక్షకు సంఘీభావంగా హర్షకుమార్ ఆందోళనకు దిగనున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటికి ఇంకా ఇంటిలోనే ఉన్న హర్షకుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.