: టీవీ ఆన్ చేస్తుండగా షాక్ కొట్టి బాలుడి మృతి!


ఇంట్లో టీవీ ఆన్ చేస్తుండగా బాలుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో ఈరోజు చోటు చేసుకుంది. అచ్యుత్ (12) అనే బాలుడు స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈరోజు సెలవుదినం కావడంతో ఇంట్లోనే ఉన్న ఈ కుర్రాడు టీవీ ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. కాగా, తోటపల్లి గ్రామంలో ఉదయం నుంచి ఆరుగురు గ్రామస్తులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ సంఘటనపై విద్యుత్ శాఖాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో తోటపల్లి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు నిర్వహించారు.

  • Loading...

More Telugu News