: ముద్రగడ గారూ, మీకిది తగునా?... చంద్రబాబు ఏటా ఆస్తులు ప్రకటిస్తున్నారుగా!: చినరాజప్ప ఫైర్


‘‘2 ఎకరాల భూమి స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్లు సంపాదించిన కిటుకేదో చెబుతారా?’’ అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపేట్టున్నాయి. ముద్రగడ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ హోం శాఖ మంత్రి (డిప్యూటీ సీఎం) నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన ముద్రగడ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేశారు. అందరు రాజకీయ నేతలకు భిన్నంగా చంద్రబాబు ఏటా తన ఆస్తులనే కాక తన కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం ప్రకటిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా చినరాజప్ప గుర్తు చేశారు. ఏ ఒక్కరూ అడగకున్నా తనకు తానుగా చంద్రబాబు తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నా, చంద్రబాబుకు రూ.2 లక్షల కోట్ల ఆస్తులున్నాయని చెప్పడం మీకు తగునా? అని ముద్రగడను చినరాజప్ప ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులపై ముద్రగడ అవాస్తవాలు మాట్లాడటం శోచనీయమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News