: తస్లీమా నోట మరోమారు ఘాటు వ్యాఖ్యలు... అన్ని మతాలు మహిళా వ్యతిరేకమేనని కామెంట్


‘లజ్జ’ లాంటి వివాదాస్పద రచనలకే కాక వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా బంగ్లాదేశ్ రచయిత్రి కేరాఫ్ అడ్రెస్. అదుపు లేని తన వ్యాఖ్యల కారణంగా స్వదేశంలో దేశ బహిష్కరణకు గురైన ఆమెకు భారత్ ఆశ్రయమిచ్చింది. అదే సమయంలో భద్రతనూ కల్పించింది. ఈ కారణంగానేనేమో, భారత్ ను ఆమె సహనశీల దేశంగానే ఒప్పుకున్నారు. అయితే దేశంలోని ఏ ఒక్క మతం కూడా మహిళలకు అనుకూలంగా లేదని ఆమె వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర లేపారు. ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో భాగంగా నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన తస్లీమా ఈ మేరకు వ్యాఖ్యానించి మతవాదులను ఆగ్రహావేశాలకు గురి చేశారు. అన్ని మతాలు కూడా మహిళా వ్యతిరేకంగానే ముందుకు సాగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News