: కాపులను బీసీల్లో చేరిస్తే... ప్రభుత్వాన్ని కూలదోస్తాం: రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక వార్నింగ్


ఓ వైపు కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిప్తాడు మండలంలోని ఆయన సొంతూరు కిర్లంపూడిలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా వుండగా, అసలు కాపులకు రిజర్వేషన్లు వద్దంటూ రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక రంగంలోకి దిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కలిసి ‘రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక’ పేరిట ఏకమయ్యాయి. వేదిక రౌండ్ టేబుల్ సమావేశం కొద్దిసేపటి క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేదిక నేతలు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వాన్ని కూలదోస్తామని కూడా వారు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News